ట్రాఫిక్ నియంత్రణపై పట్టిష్ట చర్యలు చేపట్టండి..

 డ్రగ్స్ పై యువతను చైతన్యం చేయండి.. 

 అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపండి.. 

పోలీసు అధికారుల సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్… 

 

రాజధాని వాయిస్ : డిసెంబర్ 29 

గుంటూరు.

గుంటూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ సూచించారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే నసీర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు‌ ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ గుంటూరు బస్టాండ్ వద్ద ప్రైవేట్ బస్సుల కారణంగా కలిగే ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దీని కోసం నగరంలో అనువైన ప్రదేశంలో ప్రైవేట్‌ బస్సుల కోసం బస్టాండ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు.ముగ్గురు ఎస్సైలతో కమిటీని ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఆర్టీసీ అధికారులు కమిటీగా ఏర్పడి బస్టాండ్ వద్ద ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గుంటూరు నగరంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీసు అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అభినందించారు. గుంటూరు నగరంలో ఎక్కడా గంజాయి మాట వినిపించకూడదన్నారు. గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై ఎప్పటికప్పుడు యువతను చైతన్యం చేయాలని సూచించారు‌. గుంటూరు నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడకి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, దీని కోసం నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

Post Comment

You May Have Missed

0Shares