టెక్కలిలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి..

15 కోట్లతో నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

 మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషికి ఫలితం

 

రాజధాని వాయిస్:టెక్కలి. ఫిబ్రవరి 16

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 50 పడకల సామర్థ్యంతో సమగ్ర ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రూ.15 కోట్లు వ్యయంతో ఈ కీలక ప్రాజెక్టును నిర్మించేందుకు ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, ఐఏఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హాస్పిటల్ కార్యరూపం దాల్చడం పూర్తిగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారి నిరంతర కృషి, దూరదృష్టి మరియు సమర్థ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. జాతీయ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి గరిష్ట నిధులు రాబట్టడంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. గ్రామీణ, దూర ప్రాంత ప్రజలకు ఆయుష్ వైద్య సేవలు మరింత చేరువ కావాలనే సంకల్పంతో టెక్కలిని ఆయుష్ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయుష్ శాఖ అధికారులు అవసరమైన పరిపాలనా చర్యలను పూర్తి చేసి ఉత్తర్వులు ఇచ్చారు. IPHS, NAM మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభమైతే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయుర్వేదం, యోగ, నేచురోపతి తదితర ఆయుష్ వైద్య సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం దిశగా మంత్రి అచ్చెన్నాయుడు  నాయకత్వంలో టెక్కలి నియోజకవర్గం ముందుకు సాగుతోందనడానికి ఇది మరో స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.

Post Comment

You May Have Missed

0Shares