టీటీడీ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి 

రాజధాని వాయిస్

 

తిరుమల తిరుపతి దేవస్థానములు మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు వివరాలను ప్రకటిస్తూ, రూపొందించిన కరపత్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, భగవద్గీత మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథం. ఇటువంటి పోటీలు యువతలో సత్ప్రేరణ కలిగించడమే కాకుండా, ధర్మం, నైతిక విలువల పట్ల అవగాహన పెంపొందిస్తాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares