జేటి ఛారీటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో…
డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం
రాజధాని వాయిస్:జనవరి 7 రాజుపాలెం.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్,సీనియర్ సివిల్ జడ్జి విజయ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు జాతీయ యువజన దినోత్సవం జనవరి 12 వివేకానంద జయంతి సందర్భంగా జేటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్ కోట బాబు రావు రాజుపాలెం మండలం, కొండమోడు పిఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ వద్దు జీవితాలను నాశనం చేసుకోవద్దు, యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చెడు వ్యసనాలకు లోనై బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలియజేశారు.మత్తు పదార్థాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని, మత్తు యువత జీవితాలను చిత్తు చేస్తుందని, మత్తుకు అలవాటు పడకూడదని,ఒకసారి అలవాటు పడితే బయటకు రావడం కష్టమన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో జీవితమే ముద్దు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి హీరోగా జీవించు అన్న నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోనేటి నరసింహారావు,జేటి చారిటబుల్ ట్రస్ట్ వైఎస్ ప్రెసిడెంటు కోట బాబు రావు, లెక్చరర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment