జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ పై విద్య అందిస్తాం
అక్టోబర్ 25 రాజధాని వాయిస్ కర్లపాలెం
కర్లపాలెం శ్రీ భార్గవి విద్యా సంస్థల యజమాని .వెంకట సురేష్ జర్నలిస్టుల పిల్లలకు బాపట్ల నియోజక స్థాయిలో 50 శాతం రాయితీ పై విద్యను అందిస్తానని ప్రకటించారు.శనివారం ఆయన కర్లపాలెం లోని ఆయన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విద్య తో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన సేవా కార్యక్రమాలను గుర్తించి ఏ ఎస్ పి ఎల్ పి ఓ సంస్థ అబ్దుల్ కలాం జాతీయ అవార్డు ను తనకు ప్రకటించడం పట్ల ఆయన హర్ష వ్యక్తం చేశారు. గత 18 సంవత్సరాలు వార్త దినపత్రికలో తాను పాత్రికేయుడుగా పనిచేసిన నేపథ్యం ఉందన్నారు. పాత్రికేయ మిత్రుల సాధక బాధకాలు తాను ప్రత్యక్షంగా అనుభవించినట్లు చెప్పారు. ఈ నేపద్యంలో తోటి జర్నలిస్టు మిత్రులకు తన వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.కావున బాపట్ల నియోజకవర్గ మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



Post Comment