జర్నలిస్టులపై దాడులు సరైన విధానం కాదు…

ఏపీఐజేఏ అధ్యక్షుడు రాజా

అక్టోబర్ 17
రాజధాని వాయిస్ :
మాచర్ల.

గుంటూరు జిల్లా బిగ్ టీవీ, ఐ న్యూస్ టీవీకి చెందిన సాయి, నాగేశ్వరరావు, చైతన్య, వలి అనే పాత్రికేయులపై జరిగిన దాడులను ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు యం.రాజా తీవ్రంగా ఖండించారు
ఈ దాడులు మీడియా స్వేచ్ఛపై విరుచుకుపడిన చర్యలని, జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే తమ బాధ్యతగా నిర్వర్తిస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం అత్యంత విచారకరమని ఏపీఐజేఏ అధ్యక్షులు యం.రాజా అన్నారు
ఈ సంఘటనపై ప్రభుత్వ అధికారులు తక్షణం విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా
డిమాండ్ చేశారు.
మీడియా ప్రతినిధుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక లోక్ సభ రాజ్యసభ అసెంబ్లీలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని ఒక్క జర్నలిస్టుని టార్గెట్ చేస్తే దేశవ్యాప్తంగా జర్నలిస్టు సోదరులు ఐక్యమాత్రంతో ముందుకు రావాలని ఏపీఐజేఏ అధ్యక్షులు యం.రాజా ఆయన కోరారు.
వాస్తవాలను వెలుగులోకి చీకట కోణాలని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వాస్తవ కథనాలు ప్రచురించడంతో మీడియా ఎలక్ట్రానిక్ ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండించారు జర్నలిస్టుల ఐక్యతతోనే ఇలాంటి దాడులను అరికట్టవచ్చని ఏపీఐజేఏ అధ్యక్షుడు యం.రాజా
స్పష్టం చేశారు.

Post Comment

You May Have Missed

0Shares