జనసేన పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

శిరిగిరి శ్రీనివాసరావు ఆద్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

రాజధాని వాయిస్:పిబ్రవరి 25,సత్తెనపల్లి.

సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నరసరావుపేట పార్లమెంటరీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంటరీ ఉద్యమి సభ్యత సమన్వయకర్త కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పల్నాడు ఉద్యమి సభ్యత్వ సమావేశాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస్ అభినందిస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పలనాడు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక ఉద్యమి సభ్యత్వవాలు చేసి, జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉందని చాటిచెబుదామని. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

జిల్లాకార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో అత్యధిక ఉద్యమి సభ్యత్వాలు చేసి, జిల్లాలోనే ప్రథమ స్థానం వచ్చే విధంగా ప్రతి ఒక్కరం బాధ్యతగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రతి మండలము ప్రతి గ్రామం వెళ్లి సభ్యత్వంలో కలిగే ప్రయోజనాలను జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులుకు వీర మహిళలుకు, ప్రతి ఒక్కరికి వివరంగా వివరించి అందరూ ఉద్యమి సభ్యత్వం తీసుకున్న విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఆహ్వాన్నని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన, పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పిఓసి లకు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల అధ్యక్షులుకు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, జనసైనికులుకు, వీరామహిళలు కు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ఇట్లు,

శిరిగిరి శ్రీనివాసరావు
ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి
సత్తెనపల్లి నియోజకవర్గం

Post Comment

You May Have Missed

0Shares