చేపల లీజు విషయంలో రవీంద్రా రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలు:రాం రంగారావు

చేపల చెరువు లీజు విషయంలో ఎలాంటి మోసం,దగా జరగలేదు

హెచ్చు పాటదారుడు రాం.రంగారావు

రాజధానివాయిస్:పిబ్రవరి 10,రాజుపాలెం.

రాజుపాలెం మండలం, దేవరంపాడు గ్రామానికి చెందిన రాం రంగారావు మీడియాతో మాట్లాడుతూ 2024 జనవరి 31 గ్రామంలో తెట్టెల చెరువుకు చేపల పాట పెట్టడం జరిగిందని,ఆ వేలం పాటలో 33 లక్షల,52 వేలకు తాను చేపల పాట పాడడం జరిగిందని,డిపాజిట్ 50 వేలు చెల్లించానని, ఆపాటలో వెన్నా రవీంద్రా రెడ్డి 26 లక్షల వరకు పాట పాడడం జరిగిందన్నారు.ఆ సమయంలో రవీంద్రారెడ్డి ఆ 33 లక్షలకు నేనే పాట ఉంచు కుంటాను,డిపాజిట్ అమౌంట్,జీతం ఇస్తానని ఆరోజు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ తర్వాత చేపలు వేసుకొని, పెంచుకొని జూలై లో చేపలు పట్టుకోవడం జరిగిందన్నారు.ఆ సమయంలో రంగారావుకు ఇవ్వవలసిన అమౌంట్,జీతం ఇస్తానని చెప్పుకుంటూ కాలయాపన చేశారు.ఈ లోగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన 8 లక్షల 52 వేలు పాటదారునైన నేను చెల్లించలేదని పంచాయతీ వాళ్లు 3 నోటీసులు పంపడం జరిగిందని, ఈ విషయాన్ని నేను రవీంద్రా రెడ్డికి తెలియచేశాను. అక్టోబర్ 8 అమౌంట్ చెల్లిస్తానని వచ్చి లీజు అగ్రీమెంట్ రాయమని ఒత్తిడి తెచ్చారు.అగ్రిమెంట్ రాసిన తరవాత అమౌంట్ చెల్లించమంటె చెల్లించలేదని,అందువల్ల లీజు అగ్రిమెంట్ మీద సంతకం చేయలేదని చెప్పారు.పంచాయతీ వాళ్ళు నోటీసులు పంపుతూన్నారని ప్రభుత్వానికి చెల్లించాల్సిన 8 లక్షల 52 వేలు తాను చెల్లించి చేపలు చెరువులో వేసుకున్నానన్నారు.ఈ విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పెట్టినప్పుడు రంగారావు పెట్టిన ఖర్చులు,పెట్టుబడి,పంచాయతీకి చెల్లించిన అమౌంట్ చెల్లించి చేపలు పట్టుకోమని రవీంద్రా రెడ్డికి సూచించారు.కాని పెద్ద మనుషులు చెప్పినట్లు వినకుండా వెళ్లిపోయారని,మళ్లీ ఇప్పుడు చేపల చెరువు లీజు విషయంలో ఏదో మోసం జరిగిందని జిల్లా ఎస్పీ,కలెక్టర్ కు పిర్యాదు చేయటాన్ని ఖండించారు. ఇప్పుడైన పెట్టిన పెట్టుబడి, ఖర్చులు,జీతం చెల్లిస్తే చెరువులో ఉన్న చేపలు ఇవ్వడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని,నేను ఏదో మోసం చేశానని పిర్యాదు చేయడం మంచిది కాదని,లీజు విషయంలో ఎలాంటి మోసం,దగా జరగలేదన్నారు. చేపల చెరువు కాపలా దారులకు రవీంద్రా రెడ్డి ఆరు నెలల జీతం ఇవ్వకుండా వెళ్లి పోయారని కాపలా దారులు మీడియా ముందు వాపోయారు.

Post Comment

You May Have Missed

0Shares