చుండూరులో ముందస్తుగా సంక్రాత్రి వేడుకలు…
పిల్లలకు భోగి పండ్లు పోస్తున్న అంగన్వాడి రాజ్యలక్ష్మి.
రాజధాని వాయిస్ నవంబర్ 11 చుండూరు,
చుండూరు 2వ అంగనవాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త రాజ్యలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తుగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అంగన్వాడి ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. తెలుగుదనం ఉట్టిపడే టట్లు సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేటట్లు అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు భోగి పండ్లు పోసి తల్లులు పెద్దల ఆశీస్సులను అందించారు పిల్లల చేత పలు వేషధారణలో వచ్చి తల్లులను చూపరులను అలరించారు. దీంతో అంగన్వాడి కేంద్రం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పిల్లల చేత గాలిపటాలను ఎగురవేయించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్త రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సిడిపిఓ లక్ష్మీదేవి సూపర్వైజర్ శకుంత ఆదేశాల సలహాలతో ప్రతి పండుగ వేడుకలను అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు. సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించటం మే లక్ష్యంగా వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. పండుగ వాతావరణం సామూహిక వేడుకల గొప్పదనాన్ని పరిచయం చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రాజ్యలక్ష్మి, హెల్పర్ నాగమణి, తల్లులు పాల్గొన్నారు.



Post Comment