చిరుమామిళ్లతో చెలిమి చెదరనిది..!!
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి..
రాజధాని వాయిస్ :జనవరి 10మాచర్ల:
వైసీపీ పేటిఎం బ్యాచ్ ఎంత విషప్రచారం చేసినా.., తనతో చిరుమామిళ్ల మధుబాబు తో ఉన్న చెలిమి చెదరనిదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తేల్చి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా తనను తట్టుకోలేకపోతున్న తరుణంలో నియోజకవర్గంలో చిరుమామిళ్ల యాక్టీవ్ అవ్వడం జీర్ణించుకోలేక బ్లూ మీడియా, బులుగు బ్యాచ్ తప్పుడు వదంతులను వండివారుస్తోందని క్లారిటీ ఇచ్చారు. రాజకీయంగా కష్టపడి, నష్టపోయిన వ్యక్తి చిరుమామిళ్ల మధుబాబు అని.., ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో మంచి స్ధానం కల్పించాని గతంలోనే ఆయన సిఫార్సు లేఖను సీఎం చంద్రబాబుకు అందజేసానన్నారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తించి ఆయనకు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవీని అందించిందని చెప్పారు. ఎవరు ఎంత కష్టపడినా టీడీపీ ఉన్నతి కోసమేనని, జెండా కోసం అందరూ పాటుపడాల్సిందేనని వివరించారు. ఇప్పటికైనా లేనిపోని దుష్ప్రచారాలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.



Post Comment