చిన్నపిల్లలకు మొబైల్స్ ఇస్తున్నారా ????
రాజధాని వాయిస్ : ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలు ఏడ్చినప్పుడు లేక వారు అలిగినప్పుడు సర్వ సాధారణంగా చేసే పని చిన్న పిల్లలకు మొబైల్ ఇవ్వడం. ఇలా చేయడం వల్ల పిల్లలు మొబైల్ ఫోన్ కు ఆకర్షితులై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉందని శారీరక మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు.
తదుపరి నష్టాలు ఎన్నో??
వాస్తవ ప్రపంచానికి దూరమవుతు ఒంటరితనం, చిరాకు, కోపం, డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావడం ఇలాంటివి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు ప్రముఖులు తెలియజేస్తూనే వస్తున్నారు.
వీటికి చెక్ పెట్టాలంటే ????
మొదటిగా తల్లిదండ్రులు వారి పిల్లలకు సెల్ ఫోన్ వాడకం కోసం (రోజుకు ఒక గంట)ఒక సమయ పరిమితి నియమించి పుస్తకాలు చదవడం ఆటలాడడం బొమ్మలు గీయడం ఇలా వివిధ విధాలుగా వారిలో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ సమాజంపై వారికి అవగాహన కల్పిస్తూ సమయం దాని విలువ తెలియజేస్తూ సాధ్యమైనంత మేరకు మొబైల్ కు దూరంగా ఉంచుతూ తల్లిదండ్రులు చిన్నారులతో మాట్లాడుతూ, భవిష్యత్తు ప్రణాళికపై దృష్టి పెట్టాలని చేయటం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఉంటూ భవిష్యత్తు ప్రణాళిక పై దృష్టి పెట్టి తాత్కాలిక వినోదం నుండి దూరమై ముందుకు సాగడానికి సులువుగా ఉంటుంది ఇలా చేస్తే మంచిదని అంటుంటారు.



Post Comment