ఘనంగా శ్రీ ధన మల్లయ్య స్వామి వారి…
తిరునాళ్ళ వేడుకలు
రాజధాని వాయిస్: ఫిబ్రవరి 15 కారంపూడి.
మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలోని శివారున కొండల్లో స్వయంభువుగా వెలసివున్న శ్రీ ధన మల్లయ్య స్వామి వారి తిరునాళ్లను వేద పండితులు విశ్వనాథం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులతో నిత్య పూజలు నిర్వహిస్తారు.హర హర మహాదేవ శంభో శంకర అంటూ వేలాది మంది భక్తులు ధన మల్లయ్య స్వామివారి సన్నిధికి చేరుకున్నారు.అలాగే పూర్వం నుంచి కొనసాగుతున్న ఆచారాలు సంప్రదాయాల ప్రకారం ప్రతి ఏటా శ్రీ ధన మల్లయ్య స్వామి వారి తిరునాళ్ల వేడుక నిర్వహించడం జరుగుతుంది. అలాగే భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే వేలాది మంది భక్తులకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఆలయ కమిటీ బందోబస్తు నిర్వహించారు. అలాగే భక్తుల కోసం చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. అంటూ ఆలయ కమిటీ తెలిపారు. అనంతరం భక్తులకి రవాణా సౌకర్యం లో ఆటంకం కలగకుండా ఉండేందుకు టిడిపి రాష్ట్ర వాణిజ్య కార్యదర్శి . పంగులూరి.పుల్లయ్య తమ సొంత నిధులతో రూ. 3లక్షలతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు.



Post Comment