ఘనంగా లూయిస్ బ్రెయిలీ వర్ధంతి వేడుక…

అందుల పట్ల ప్రతి ఒక్కరు మంచి భావన కలిగి ఉండాలి

మునిసిపల్
కమిషనర్ వేణుబాబు

రాజధాని వాయిస్ : జనవరి 6
మాచర్ల.

పురపాలకసంఘ కార్యాలయం నందు లూయిస్ బ్రెయిలీ వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ డి. వేణు బాబు మాట్లాడుతూ, అంధుల పట్ల ప్రతి ఒక్కరూ మంచి భావన కలిగి ఉండాలని, వారిని సమాజంలో సమాన హక్కులతో గౌరవించాలని తెలిపారు.
లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం రూపొందించిన బ్రెయిల్ లిపి వారి విద్య, జీవనోపాధి మరియు స్వావలంబనకు మార్గం చూపిందని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ చంద్ బాషా, మునిసిపల్ ఇంజనీర్ ఏఈ రాఘవేంద్ర,జిల్లా అందుల ఉద్యోగుల సంఘ ఉపాధ్యక్షుడు కోలా కోటేశ్వరరావు మరియు మునిసిపల్ అధికారులు, మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొని లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Post Comment

You May Have Missed

0Shares