ఘనంగా బాపూజీ  78వ వర్ధంతి…

 

రాజధాని వాయిస్ :

జనవరి 30 భట్టిప్రోలు.

 

జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి వేడుకలు మండల పరిధిలో పలు గ్రామాలలో నిర్వహించారు. మండల కేంద్రమైన భట్టిప్రోలు వాసవి క్లబ్ అధ్యక్షుడు తూనుగుంట్ల నాగభూషణం ఆధ్వర్యంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు.స్థానిక రథం సెంటర్లో, ప్రభుత్వ వైద్యశాలలో నున్న మహాత్మా గాంధీ విగ్రహాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు, రొట్టెలు,పండ్లు అందించారు.ఈ కార్యక్రమంలో వాసవి దేవస్థానం అధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబా,వాసవి క్లబ్ సభ్యులు మెంటా సతీష్,చెన్నా వెంకటేశ్వరరావు,విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు చందులూరి రామకోటేశ్వరరావు, తూనుగుంట్ల శ్రీధర్, గ్రామ ఉపసర్పంచ్ బూర్లే రామ ప్రసాదు, వాసవి కుబేర వనిత అధ్యక్షురాలు పెనుగొండ నాగరాజ కుమారి,డాక్టర్ ముహిసిన తాజ్, వైద్యశాల సిహెచ్ఓ మంగరాజు బి,ఫార్మసిస్ట్ నాగ కన్యకా దేవి,ఆరోగ్య సిబ్బంది,ఆర్యవైశ్య నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares