గ్రామాల్లో సంచరిస్తున్న పందులపై చర్యలు తీసుకోవాలి….
అక్టోబర్ 22
రాజధాని వాయిస్: భట్టిప్రోలు.
మండలకేంద్రమైన భట్టిప్రోలులో రహదారులపై పందుల స్వైర విహారం కారణంగా ప్రజలు ఎందరో ఇబ్బందులు పడుతున్నారు.భట్టిప్రోలు ప్రధాన రహదారులలో, నివాస స్థలాల మధ్య పందుల సంచారం ఎక్కువగా ఉంది.
సీజనల్ వ్యాధులతో ప్రజలు భయపడుతుంటే వీటికి తోడు పందుల సంచారం ఎక్కువ అవ్వటంతో ఎక్కడ రోగాల భారిన పడతామోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
పందుల సంచారంపై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వాటి సంచారాన్ని నివారించాలని ప్రజలుకోరుతున్నారు.



Post Comment