గ్యార్మి జెండాను ఊరేగిస్తున్న భక్తులు
రాజధాని వాయిస్: కొల్లూరు. అక్టోబర్ 18
గ్యార్మీ పండగ పర్వదినోత్సవ వేడుకలు కొల్లూరులో అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం గ్రామంలో విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దిన జెండాను గ్రామ పురవీధులలో ఊరేగించారు. జండా పండగను పురస్కరించుకొని మతసామరస్యానికి ప్రతీకగా హిందువులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని ముస్లింలతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మాజీ ఎంపీపీ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూధన ప్రసాద్ పాల్గొన్నారు.



Post Comment