గౌతమ్ రెడ్డి దంపతులను ఆశీర్వదించిన..
సీఎం చంద్రబాబు
రాజధాని వాయిస్ : వెల్దుర్తి అక్టోబర్ 27
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి, కోడలు తేజస్విని రెడ్డిలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారు. సోమవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని, నవ దంపతులకు పుష్పగుచ్చాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అశేషంగా తరలివచ్చిన శ్రేణుల జన సంద్రోహానికి అభివాదం చేసిన చంద్రబాబు, ఎమ్మెల్యే జూలకంటి దంపతులకు ఆశీసులు అందజేశారు.



Post Comment