గురజాల నియోజకవర్గంలో 3 కోట్ల 80 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ
గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు
రాజధాని వాయిస్:అక్టోబర్ 22,పిడుగురాళ్ల.
పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పటల్లో చికిత్స చేయించుకోని, ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 51 మంది లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు 42,34,920 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఇప్పటి వరకు 360 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3,80,31,487 చెక్కుల రూపంలో యరపతినేని అందజేశారు.



Post Comment