గుంటూరులో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై పోలీసుల ఉక్కుపాదం

రాజధాని వాయిస్: గుంటూరు. అక్టోబర్ 27

రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై గుంటూరు పోలీసులు రెండురోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఉక్కు పాదం మోపారు. ఈ సందర్భంగా
ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ,
భారత్ దేశంలో ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది వాహన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మేము బాగా డ్రైవ్ చేస్తాము అనడం సరిపోదు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనం ఇవ్వడం చట్టవిరుద్ధమని, మైనర్స్ డ్రైవ్ చేస్తే, వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఆ వయసులో మెచ్యూరిటీ లేకపోవడం, కేర్‌లెస్‌గా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు.
ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు.

Post Comment

You May Have Missed

0Shares