గాంధీజీ పిల్లల కోసం పుస్తకం ఆవిష్కరణ
స్కాలర్ డిగ్రీ కాలేజీ నందు”” గాంధీజీ పిల్లల కోసం శీర్షిక గల పుస్తకం”” ఆవిష్కరణ
రాజధాని వాయిస్:డిశంబర్ 18,పిడుగురాళ్ల.
పిడుగురాళ్లపట్టణంలోని కళ్ళం టౌన్షిప్ నందు నర్సారావు పేట గాంధీవనం నిర్వహకులు ఈదర గోపీచంద్ ఆధ్వర్యంలో గాంధీజీ పిల్లల కోసం పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా మహాత్మ గాంధీ బాల్యం,ఉద్యమాలు,స్వాతంత్య్ర ఉద్యమం,శీలం,సత్య శోధన మొదలైన విషయాలు వివరించడం జరిగింది. కార్యక్రమంలో కవి రచయిత యక్కల మోహన్ రావు,ఆంగ్ల మాధ్యమం పరిరక్షణ వేదిక కన్వీనర్ దాది నబోయిన ఏడుకొండలు, స్కాలర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆవుల జనార్దన్ రావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



Post Comment