కోనసీమ జిల్లా సమగ్రాభివృద్ధికి సమన్వయ కృషి

 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందుచూపు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.. 

తుపానులో అధికార యంత్రాంగం చక్కగా పనిచేసింది… 

తుఫాను విపత్తును ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది

అధికార యంత్రాగాన్ని అభినందించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ ,

రాజధాని వాయిస్
నవంబర్ 8
డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.

సమగ్రాభివృద్ధికి సమన్వయ కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం
డా. బి.ఆర్. అంబేద్కర్ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల సంభవించిన మొoథా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాలు, వ్యవసాయ , ఉద్యాన పౌరసరఫరాల మార్కెటింగ్, విద్యుత్ , వివిధ రెవెన్యూ సమస్యలు వైద్యవసతుల కల్పన పశు సంవర్ధన పాడి పరిశ్రమల పనితీరుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతిని ధులు అధికారులు సమ న్వయంతో సమర్థవంత మైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు . మొoథా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి క్షేత్రస్థాయి జిల్లా యంత్రాంగం ప్రజాప్ర తినిధులు భాగస్వామ్యంతో చేపట్టిన ముందస్తు హెచ్చ రికలు తీసుకున్న చర్యలు సఫలీకృతం కావడంతో నష్టాలను నివారించ గలిగామన్నారు.అయిన ప్పటికీ దురదృష్టవశాత్తు ఒక మహిళ చెట్టు పడి చనిపోవడం దురదృష్టకర మన్నారు .తుఫాను ప్రభావిత మండలాలలో వంట గృహ ఆస్తి నష్టాలు అంచనా రూప కల్పన ప్రక్రియ ఈనెల 7 తో ముగిసిందన్నారు రైతుల సకాలంలో నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ ఉద్యాన అధికారులు ప్రజా ప్రతినిధులు వివిధ పంటల పరిస్థితిపై వివరాలు అందించారు.బాధిత కుటుంబాలకు అందిన పునరావాస తాత్కాలిక సహాయక ఉపశ మన చర్యలను అడిగి తెలు సుకున్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలని ఆదేశించారు ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రతీ నిరుపేదకు చేరాలని, లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియలో అధికారులు పారదర్శకత పాటించాలన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్య మన్నారు. ప్రజలకు మంచి పాలనను అందించాలన్న దృక్పథంతో అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటి ప్రస్తుత స్థితిపై సంబంధిత అధికారులు కమిటీ సభ్యు లకు వివరించారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను మంత్రికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వివరించారు. జిల్లాలో సమస్యగా ఉన్న డెల్టా ఆధునికరణ డ్రైనేజీలలో పూడుకు తేట పనుల కొరకు 12 కోట్లు సర్వేకి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన లు క్రోడీకరించి డెల్టా డ్రైనేజీ పూడికతీత ఆధునీకరణ వ్యవస్థకు అవసరమైతే బ్యాంకు రుణం ద్వారా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో పునరావాస్ కేంద్రాలకు వచ్చిన ముంపు బాధితు లకు పునరావాస ఉపశమన కార్యక్రమాల్లో భాగంగా 25 కేజీలు బియ్యం ఐదు రకాలు నిత్యవసరాలు తో పాటుగా 3వేల రూపాయల తాత్కాలిక ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. తుఫాన్ హెచ్చరికలు మూలంగా చేపల వేట కోల్పోయిన మత్స్యకార, చేనేత రంగ కార్మిక కుటుంబాలకు 50 కేజీలు బియ్యం ఐదు రకాలు ఇచ్చే అవసరాలు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. పంట నష్టపరిహారాలను హెక్టా రుకు 17 వేల నుండి 25 వేలకు పెంచి అందిస్తున్నట్లు తెలిపారు అరటి నష్టపరి హారంగా హెక్టారుకు 35000 ఇస్తున్న ట్లు వెల్లడించారు. జిల్లాలో 99.5 శాతం ఈ క్రాప్ నమోదు కావడం జరిగిందన్నారు ఈ నెల 11 వరకు మిగిలిన శాతాన్ని పూర్తిచేసి నూటికి నూరు శాతం నమోదు చేయడం జరుగుతుందన్నారు.
రీ సర్వే మూలంగా ఉత్పన్న మవుతున్న రెవెన్యూ సమస్యలు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మండలానికి మూడు రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సమగ్రంగా సర్వే చేపడుతూ భవిష్యత్తులో రెవెన్యూ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పరచుకున్న వారికి భూముల క్రమబద్ధీకరణ కింద శాశ్వత హక్కుల పట్టాలు జారీ చేస్తున్నామన్నారు. పలువు రు ప్రజాప్రతినిధులు కోన సీమ జిల్లా వ్యవసాయ ఆధారిత పల్లపు ప్రాంత మని అత్యంత ప్రధానంగా ముంపు బెడదను నివారించాలని ముక్తకంఠంతో మంత్రిని కోరారు. అమలాపురం మండపేట ప్రాంతాలలోని అసంపూర్తి గా ఉన్న టిడ్కో గృహ నిర్మాణా లను పూర్తిచేసి మార్చి నెలలో సామూహికంగా లబ్ధిదారులతో గృ హప్రవే శాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణాల కొరకు కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిగణనలో తీసుకుని నివేశన స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయడా నికి చర్యలు చేపడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా 18 శాఖలకు సంబంధించి నష్ట అంచనాలను రూపొందించి సమర్పించడం జరిగింద న్నారు. కొబ్బరి చెట్టుకు నష్టపరిహారంగా 1500 చెల్లించడం జరుగుతుంద న్నారు. బీమా ప్రీమియం ఉన్న రైతులకు బీమా పరి హారాలు కూడా అందిoచడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్దేశించిన టార్గెట్ 3 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు గా ఉందన్నారు. తుఫాన్ కు ముందు జిల్లా వ్యాప్తంగా వరి పంట దిగుబడి 4 లక్షల 30 వేల మెట్రిక్ టన్నులు కాగా తుఫాన్ అనంతరం పంటలు తినడంతో దిగుబడి 3, 57,000 వేలుగా ఉందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇచ్చిన టార్గెట్ దాదాపుగా సరిపోతుందన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా రైతులు వద్ద ఇబ్బందులు పెట్టకుండా సేకరించాలని మంత్రి సూచించారు. ధాన్యం భద్రపరుచుకునే నిమిత్తం అవసరమైన మేరకు సరఫరా కాబడిన తార్పాలిన్లు సమకూర్చా లన్నారు. ప్రభుత్వాలు మంజూరు చేసే పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సమాచారాన్ని జిల్లా స్థాయి అధికారులు స్థానిక ప్రజాప్ర తినిధులకు తెలియజేసి వారి భాగస్వామ్యంతో ఆయా నిర్మాణాల ద్వారా వస తుల కల్పనకు నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడానికి కృషి చేస్తూ ఆయా వసతులు సంక్షేమ ఫలాల లబ్ధిని చిట్టచివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాల పట్ల అధికారులు తక్షణమే స్పందించి ఆయా గ్యాప్ ల ను పూరించేందుకు ప్రతిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం గ్రామ సచివా లయాన్ని విజన్ యూనిట్ గా నియోజ కవర్గం విజన్ డాక్యుమెంట్ కార్యాలయం గా ప్రకటించిందని వాటి ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న హెల్త్ సెంటర్లలో తాత్కాలికంగా సిబ్బందిని నియమిం చి ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలన్నారు. నరేగా అనుసంధానంతో సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ప్రకారం పనులు చేపడుతూ 100 పని దినాలు కల్పించాలని ఆదేశించారు.ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందేలా జల వనరుల శాఖ ప్రతిపా దనలను రూపొందించి ఆ మేరకు నిధులు కోరుతూ రైతాంగానికి సాగునీరు సకాలంలో అందించాలన్నా రు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధి కారుల సమన్వయంతో తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, డిఆర్ఓకే మాధవి, శాసన మండల సభ్యులు పేరా బత్తుల రాజశేఖరo, తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కె సూర్యనారాయణ రావు, శాసనసభ్యులు ఏ ఆనందరావు, బండారు సత్యానందరావు, వేగుళ్ళ జోగేశ్వరరావు, దేవవర ప్రసాద్, గిడ్డి సత్యనారాయణ, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares