పల్నాడు జిల్లా,రాజుపాలెం మండలం, కోట నెమలిపురి గ్రామంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు గుంటూరు సిబార్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సి.ఎస్.ఆర్ డైరెక్టర్ డాక్టర్ బి. భబిత మాట్లాడుతూ ఏ ఎన్ యు సిఎస్ ఆర్ ఆధ్వర్యంలో సమాజానికి ఉపయోగపడే విధంగా ఆరోగ్య ప్రయోజనాల కొరకు కొన్ని మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా గ్రామంలో దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినదని తెలిపారు. ఇటువంటి క్యాంపులతోపాటు మహిళలకు ఉపయోగపడే విధంగా వృత్తి నైపుణ్యం శిక్షణ కార్యక్రమాలను వివిధ ప్రాంతాలు నిర్వహిస్తామని తెలిపారు.డాక్టర్ పావని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దంత సంరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు, విద్యార్థులకు సిబార్ సిబ్బంది దంతరక్షణకు అవసరమైన విషయాలపై అవగాహన కల్పించడం జరిగినది. అవగాహన కార్యక్రమం అనంతరం ఉచిత పరీక్షలు నిర్వహించి, మందులు, పేస్ట్ , మౌత్ వాష్ ఉచితంగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం .వెంకటరమణ, పంచాయతీ సెక్రెటరీ శ్యాంప్రసాద్, గ్రామ నాయకులు సానికొమ్ము కోటిరెడ్డి, కెఎన్ఆర్ విద్యాసంస్థల డైరెక్టర్స్ కోనేటి నరసింహారావు, బాడిస మస్తాన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Post Comment