కోటి సంతకాల మహా ఉద్యమ ర్యాలీ

కోటి సంతకాల మహా ఉద్యమ ర్యాలీ

రాజధాని వాయిస్:డిశంబర్ 9,నరసరావుపేట.

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రైవేటీకరణ చేశారు. ఇది చాలా దారుణమైన అంశమని, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది .
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ ఐదో తారీకు నుంచి ఈ యొక్క కోటి సంతకాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి డిసెంబర్ 10వ తారీఖు ఈ సంతకాల సేకరణ పూర్తి చేసి కార్యక్రమం చేస్తున్నాం.ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సరైనది కాదని సంతకాలు చేయడం జరిగింది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం నరసరావుపేట నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది.
62,500 సంతకాలను నరసరావుపేట నియోజకవర్గంలో సేకరించడం జరిగింది.పుస్తకాల రూపంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి పుస్తకానికి 100 సంతకాలు స్వీకరించడం జరిగింది.
ప్రతి వార్డు నుంచి ప్రతి గ్రామం నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది .
పేరు, ఫోన్ నెంబర్ , నివాస ప్రాంతం సంతకం ఈ నాలుగు అంశాలు, పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకాలన్నిటిని కూడా బాక్సుల్లో గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి లింగంగుంట్ల లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు ర్యాలీగా తీసుకువెళ్లి ,జిల్లా ఆఫీసులో భద్రపరచడం జరుగుతుంది .
15 తారీఖున అన్ని జిల్లా కేంద్రాల నుంచి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని నియోజకవర్గాల తాలూకు పుస్తకాలు ఒక పెద్ద వెహికల్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేర్చడం జరుగుతుంది.
గవర్నర్ గారి అపాయింట్మెంట్ మేరకు జగన్ మోహన్ రెడ్డి గారు 16వ తారీఖున రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఈ యొక్క కోటి సంతకాల సేకరణకు సంబంధించిన ప్రతి సంతకాన్ని కూడా గవర్నర్ గారికి ఆరోజు అందజేయడం జరుగుతుంది.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి.
సంపద సృష్టిస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని తన అనుచరులకు పప్పు బెల్లాల్లాగా అమ్మే కార్యక్రమం చేస్తుంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు ఒక్కొక్క మెడికల్ కాలేజీ కొరకు దాదాపు 50 ఎకరాలు భూమి సేకరించి ఇస్తే ఒక్కొక్క ఎకరానికి 100 చొప్పున 5000, ఒక మెడికల్ కాలేజీని 66 ఏళ్ల కు రిలీజ్ కి ఇచ్చారు. ఎవరైతే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పొందుతున్నారో వారికి మెడికల్ కాలేజీ అనుబంధంగా ఏర్పాటు చేసిన హాస్పటల్ కూడా ఉచితంగా అప్పజెప్పి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది.
ఈ రెండు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు చేశారు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం సంవత్సరానికి 1000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరా ?
ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది .మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మెడికల్ సీట్లలో సగం సీట్లు ప్రైవేటు యాజమాన్యం అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క కళాశాలకు100 మెడికల్ సీట్లు వస్తే 50 సీట్లు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఈ 50 సీట్లలో 25 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో సంవత్సరానికి రెండు కోట్లు ,25 సీట్లు సంవత్సరానికి 10 లక్షలు, 11 లక్షలు చొప్పున తీసుకుంటారు. నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కేవలం
50 సీట్లు మాత్రమే ఇస్తారు. ప్రైవేటు యాజమాన్యాల అమ్ముకోవడానికి ఇచ్చిన 50 సీట్లు కూడా గవర్నమెంట్ పరిధిలో ఉంటే పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ సీట్లను బడుగు బలహీన వర్గాలు మరియు వెనకబడిన తరగతులకు కేటాయించవచ్చు .
దాదాపు ఉచితంగా 2500 సీట్లు ఇవ్వాల్సిన సీట్లు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు .
సంపద సృష్టిస్తామంటే ఇదేనా చంద్రబాబు నాయుడు ?
మెడికల్ కాలేజీలు అమ్ముకునేనా నువ్వు సంపద సృష్టించేది అని ప్రశ్నించారు .
ఈ రెండు సంవత్సరాల కాలంలో నువ్వేమి సంపద సృష్టించావు? అని,
మెడికల్ కాలేజీల ప్రైవేట్ అన్నకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేసినందుకు నరసరావుపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, మరియు సంతకాలు చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ , ఈ సంతకాల సేకరణ చేసిన ప్రతులను తరలించే కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వైఎస్ పార్టీకి నాయకులు ,కార్యకర్తలు శ్రేయోభిలాషులు అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Post Comment

You May Have Missed

0Shares