కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయండి
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అక్టోబర్ 18
రాజధాని వాయిస్:పెదకూరపాడు.
ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నియోజకవర్గస్థాయి రచ్చబండ మరియు సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం దారుణం అన్నారు వైకాపా ఆధ్వర్యంలో ఈ నెల 10 నుండి నవంబర్ 22 వరకు చేపట్టే రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని నాయకులు కార్యకర్తలు అందరూ జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment