కోటప్ప కొండ దిగువన రోడ్డు భద్రత అవగాహన స్టాల్ ను
ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్రిక శుక్ల
రాజధాని వాయిస్:ఫిబ్రవరి 15
నరసరావుపేట.
మహా శివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా కొండ దిగువున వివిధ ప్రభుత్వ స్టాల్ల్స్ ను జిల్లా కలెక్టర్ కృత్రిక శుక్ల ప్రారంభించారు. వాటిలో పల్నాడు జిల్లా రహదారి భద్రతా కమిటీ సభ్యులు ఆర్ కనకదుర్గ పద్మజ ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన స్టాల్ ద్వారా భక్తులకు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకో వలసిన జాగ్రత్తలు గురించి వివరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్టాల్ లో రోడ్డు ప్రమాదం జరిగిన సమయం లో గాయపడిన వారికి సహాయం చేయడం, డ్రైవర్లు ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సి.పి.ఆర్ పై అవగాహన,రిఫ్లెక్టర్స్ వాటి అవశ్యకత గురించి ముఖ్యముగా ఆడియో ద్వారా రోడ్డు భద్రతా అంశాలు వినిపించారు.



Post Comment