కొబ్బరి కాయల వాహనం బోల్తా,ముగ్గురు మృతి
కొబ్బరికాయల వాహనం తిరగబడి ముగ్గురు మృతి.ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు
రాజధాని వాయిస్ డిసెంబర్12 కొల్లూరు,
కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న వాహనం తిరగబడి ముగ్గురు మృతి చెందిన సంఘటన కొల్లూరు మండలం లో చోటుచేసుకుంది. శుక్రవారం
స్థానికులు తెలిపిన వివరాల మేరకు… కొల్లూరు నుండి చెరుకుపల్లి కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న వాహనం దోనెపూడి, కోటిపల్లి మార్గమధ్యంలో పంట కాలవలో తిరగబడింది. ఈ వాహనంపై నలుగురు కూర్చున్నగా లోపల డ్రైవర్ తో సహా ముగ్గురు ఉన్నారు. వాహనం పైన ఉన్న వారిలో ఒకరు దూకి వేయగా ముగ్గురు వాహనం కింద పడి మృతి చెందారు. వాహనం లోపల ఉన్నవారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు వారిలో ఇరువురిని అంబులెన్స్ లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భట్టిప్రోలు మండలం చింతమోటు కు చెందిన చాట్రగడ్డ కాంతారావు (50), పెసర్లంక శ్రీనివాసరావు (55), వెల్లటూరు గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ (60) లు వాహనం కింద పడి మృతి చ మృతి చెందారు అన్నారు.ప్రమాద స్థలానికి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. వాహనంపై మొత్తం ఏడుగురు ఉన్నారని వారిలో ఇద్దరు తీవ్ర గాయాలు అవటంతో ఆసుపత్రిలో తరలించాలని ముగ్గురు చనిపోయారని ఇద్దరు సేఫ్ గా ఉన్నారని స్థానికులు తెలిపారు.
దోనెపూడి నుండి చెరుకుపల్లి వెళ్తున్న కొబ్బరికాయల లోడు వాహనం దోనేపూడి వద్ద తిరగబడి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సంఘటనలకు వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతులు చింతమోటు గ్రామానికి చెందినవారు.



Post Comment