కృష్ణా నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
రాజధానివాయిస్:అక్టోబర్ 29,బెల్లంకొండ.
మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, ప్రజల ప్రాణరక్షణ సమాజ శ్రేయస్సును ప్రధాన ధ్యేయంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో బాగంగా కృష్ణా నదిలో చేపలు పట్టుకోడానికి పరసగాని.శ్రీను,శ్రీరామ్ నగర్ కాలనీ, మేళ్లచెరువు మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మిషన్ బోటు వేసుకొని తోటి జాలర్లతో కలసి కృష్ణా నదిలోకి వెళ్ళడం జరిగింది.రాత్రి చేపల వేట ముగించుకొని తిరుగు ప్రయాణం లో తన బోటు మిషన్ చెడిపోవడం వలన దగ్గరలో ఉన్న చిన్న ఒడ్డు ప్రాంతానికి చేరుకున్నట్లు, తుఫాను తీవ్రత కారణంగా ఎటూ వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఉండగా బెల్లంకొండ ఎస్సై.ప్రవీణ్ కుమార్ రాబడిన సమాచారం మేరకు సత్తెనపల్లి డిఎస్పీ.హనుమంత రావు, పెదకూరపాడు సర్కిల్ సీఐ .సురేష్ పర్యవేక్షణలో వారి సిబ్బందితో కృష్ణానది నీటి ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని స్థానిక జాలర్ల సహాయంతో చాకచక్యంగా రక్షించి, సురక్షితంగా బంధువులకు అప్పగించారు.



Post Comment