కులాల మధ్య మంట పెట్టి చలికాచుకోవాలని చూస్తున్న వైసిపి
జనసేన పార్టీ అధ్యక్షుడు కామిశెట్టి రమేష్
రాజధాని వాయిస్:అక్టోబర్ 23,పిడుగురాళ్ల.
వైసీపీ పార్టీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజల్లో విభేదాలు రేపేందుకు ప్రయత్నిస్తుందని జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ తీవ్రంగ ఖండించారు. వైసీపీ నేతలు కుల గొడవలు సృష్టిస్తూ రాజకీయ లాభం పొందేందుకు యత్నించడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు ప్రజలు తిప్పికొడతారని, కూటమి ప్రభుత్వం నిజాయితీతో ప్రజల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మునిసిపాలిటీ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



Post Comment