కార్తిక సోమవారం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
రాజధాని వాయిస్ :కొల్లూరు. అక్టోబర్27
పవిత్ర కార్తిక మాసం తొలి సోమవారం భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. కొల్లూరులోని అనంత భోగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.బ్రహ్మసూత్ర సహిత అనంత భోగేశ్వర స్వామి వారికి అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం శివలింగాకృతికి దీపాలంకరణను భక్తులు చేశారు.ఆలయాల కమిటీ సభ్యులు భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.



Post Comment