పూర్వ టెన్త్ మెరిట్ విద్యార్థినీలకు జనసేన నగదు బహుమతులు.
ప్రతి ఏడాది జనసేనపార్టీ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలు అందిస్తాం.
అనుపాలెం సొసైటీ ప్రెసిడెంట్, మండల జనసేన అధ్యక్షుడు తోట నరసయ్య.
రాజధాని వాయిస్:పిబ్రవరి 17, రాజుపాలెం.
క్రమశిక్షణ ,ఏకాగ్రతతో ఇష్టపడి ఉన్నత చదువుకొని విద్యార్థులు జీవితంలో స్థిరపడాలని అనుపాలెం సొసైటీ ప్రెసిడెంట్, మండల జన సేన పార్టీ అధ్యక్షుడు తోట నరసయ్య మనస్పూర్తిగా ఆకాంక్షించారు. మంగళవారం రాజుపాలెం మండల కేంద్రంలోనీ కస్తూరిబా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో ఫెరెవెల్ వేడుకలు ఆట పాటలతో ఆనందోత్సాహాల నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం మరుపురానిదని, తల్లిదండ్రుల వద్ద అలకలు ,క్లాస్ రూమ్ కేరింతలు , ఎగ్జామ్స్ టెన్షన్,లంచ్ బ్రేక్ ముచ్చట్లు ఇలా ప్రతిదీ మరుపురానిది అని గుర్తు చేశారు.ఫెరెవెల్ అంటే (విపోవడం కాదు)కొంత బాధ అయినప్పటికీ ఇది సరికొత్త ఆరంభం అని నరసయ్య చెప్పారు.చదువులతో పాటు ,ఆటలలో కూడా రాణించాలన్నారు. నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకొని , అంకితభావంతో గురువులు చెప్పే మార్గ దర్శకాలతో ముందుకు సాగుతూ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు పెంపొందెల పాటుపడాలన సూచించారు.గత ఏడాది పది పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన జమ్మూ హారిక కు మొదటి బహుమతిగా తోట నరసయ్య 5116 , అలాగే 511 మార్కులు సాధించిన బండి లక్ష్మీ ప్రసన్న కి రెండోవ బహుమతిగా 3116 , అలాగే 508 మార్కులు సాధించిన కటారి శ్రావణి కి పగడాల నరసింహారావు 2116 బహుమతిని అందించారు. ఈ సందర్భంగా రాజుపాలెం గ్రామ జన సేన పార్టీ అధ్యక్షుడు నారపుశెట్టి కోటేశ్వరరావు వచ్చే ఏడాది లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థినికి తాను మొదటి బహుమతి అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం జన సేన ,యస్ టి యు నాయకులను కస్తూరి పాఠశాల ఉపాద్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పగడాల నరసింహ రావు,నారపు శెట్టి కోటేశ్వరరావు, ఎస్టీయు నాయకులు పురుషోత్తం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment