కలెక్టర్ల సదస్సు లో పాల్గొన్న గుంటూరు జిల్లా కలెక్టర్,ఎస్పీ
కలెక్టర్ల సదస్సు లో పాల్గొన్న గుంటూరు జిల్లా కలెక్టర్,ఎస్పీ
రాజధాని వాయిస్:డిశంబర్ 18,గుంటూరు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు.ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంతో పాటు, జిల్లాలో శాంతిభద్రతలపరిరక్షణపై ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు.
సుపరిపాలన అందించడంలో జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.



Post Comment