కలశం పేరుతో రూ.15ల మోసం

 ఎనిమిది మందితో కలిసి నిందితుడు అరెస్టు

దుర్గి పోలీస్ స్టేషన్ నందు గురజాల సిఐ భాస్కర్ మీడియా సమావేశం

రాజధాని వాయిస్ :అక్టోబర్ 28 దుర్గి.

ప్రకాశం జిల్లా దర్శి గ్రామానికి చెందిన కట్టా రంగస్వామి మరియు అతని స్నేహితుడు సయ్యద్ బాబు లను ఒక మోసగాడు భారీగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.విజయవాడ పట్టణానికి చెందిన సాడి వెంకట రెడ్డి అనే వ్యక్తి తన వద్ద శక్తులు కలిగిన కలశం ఉందని, దానిని అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పి బాధితులను నమ్మించాడు.ఆ కలశాన్ని అమ్మడానికి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పి రంగస్వామి, సయ్యద్ బాబులనుండి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితులు అడిగినప్పుడు, నిందితుడు సోమవారం పల్నాడు జిల్లా దుర్గి మండలం నిదానంపాడు గ్రామానికి రండి, డబ్బు ఇస్తాను అని చెప్పాడు.వారు నిదానంపాడు చేరుకున్న తర్వాత, సాడి వెంకట రెడ్డి తన అనుచరులు మరో ఎనిమిది మందితో మూడు కార్లలో అక్కడకు వచ్చి మళ్లీ కలశం చూపించి, మరింత పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేశాడు.బాధితులు డబ్బు ఇవ్వలేమని చెప్పడంతో, నిందితులు వారిని దాడి చేసి బెదిరించినట్లు, పెట్టుబడి పెట్టకపోతే చంపేస్తాం అని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు మేరకు దుర్గి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.తదుపరి దర్యాప్తులో, దుర్గి ఎస్సైకి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడు వెంకట రెడ్డి సహా ముద్దాయిలను దుర్గి మండలం అడిగొప్పుల గ్రామ శివారులోనిశ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి గుడి వద్ద అరెస్టు చేశారు.అరెస్టు చేసిన వారిని మాచర్ల గౌరవ ఏజెసిజెకోర్టు ఎదుట హాజరు పరచగా, కోర్టు ఆదేశాల మేరకు వారందరినీ రిమాండుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Post Comment

You May Have Missed

0Shares