కర్నూలు బస్సు దగ్ధం కేసులో డ్రైవర్ పల్నాడు వాసి

రాజధాని వాయిస్:అక్టోబర్ 25,అమరావతి.

కర్నూలు బస్సు దగ్ధం సంఘటనలో 19 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో దాన్ని డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య నడిపాడు. ఇతనిది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామం. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉంది. లక్ష్మయ్య మాత్రం ఐదో తరగతి వరకే చదివి, పదో తరగతి ఫెయిలైనట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి లైసెన్స్ పొందాడు. 2004లో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఆ సమయలో క్లీనర్ చనిపోగా ఇతను బయటపడ్డాడు.

Post Comment

You May Have Missed

0Shares