కర్నూలు జిల్లాలో బస్సు అగ్ని ప్రమాదంపై తీవ్ర ఆవేదన

 వ్యక్తం చేసిన మంత్రి అచ్చే నాయుడు

అక్టోబర్ 24
రాజధాని వాయిస్
అమరావతి

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్నిప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారులకు మంత్రి ఆదేశించారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
మృతులకు సంతాపం మంత్రి తెలిపారు.
వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఆయన ఇచ్చారు.ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి హెచ్చరించారు.
ప్రయాణికుల భద్రతకు ట్రావెల్ సంస్థలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల‌ని మంత్రి సూచించారు.

Post Comment

You May Have Missed

0Shares