ఐలవరం పునరావాస కేంద్రంలో 132 మంది చేరిక
రాజధాని వాయిస్: భట్టిప్రోలు.అక్టోబర్ 28
తుఫాను కారణంగా భట్టిప్రోలు మండలంలోని ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో భట్టిప్రోలు, ఐలవరం గ్రామాల నుండి సుమారు 132 మందిని చేర్చామని,తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పూరి గుడిసెలు, తాటాకు ఇల్లు ఉన్న వారిని ముందస్తు చర్యలుగా సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి ఆహారం, త్రాగునీరు, విద్యుత్తు కొరకు జనరేటర్ వంటి అన్ని విధాల వసతులను కల్పించి ఏర్పాటు చేసినట్లు మండల తహశీల్దార్ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. మండల వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఐలవరం పునరావాస కేంద్రానికి భట్టిప్రోలు నుండి కూడా 21 మందిని మంగళవారం తరలించినట్లు ఆయన వివరించారు.అదేవిధంగా మిగిలినవారు గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుండి నిరుపేద బాధ్యత కుటుంబాల వారిని ఈ శిబిరానికి తరలించినట్లు ఆయన వివరించారు. వీరికి అవసరమైన వైద్య శిబిరం అధికారుల పర్యవేక్షణ సిద్ధం చేశామన్నారు. కాగా ఈ పునరవాస కేంద్రాన్ని వేమూరు సిఐ పసుపులేటి వీరాంజనేయులు, భట్టిప్రోలు ఎస్సై ఎం. శివయ్య సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.



Post Comment