ఎస్సీ,ఎస్టీ కేసు అట్రాసిటీ భాదితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలి: డి బి హెచ్ అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలోని బాధితులకు నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలి

   డిబి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్

రాజధాని వాయిస్:పిబ్రవరి 4,నరసరావుపేట.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలోని బాధితులకు నష్టపరిహారం తక్షణమే అందజేసే విధంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహార్ మరియు సభ్యులను రమేష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు ఎస్సీ,ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసుల విచారణ వేగవంతం చేసి నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా పోలీస్ అధికారులు కృషి చేసే విధంగా ఎస్సీ కమిషన్ ఆదేశించాలని దళితుల భూములను ఆక్రమించుకున్న అగ్రవర్ణాపై ఎస్సీ కమిషన్ ఉక్కుపాదం మోపాలని దళితులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్న అగ్రవర్ణాలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares