ఎస్పీ ఆద్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

రాజధాని వాయిస్:అక్టోబర్ 25,నరసరావుపేట.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం – 2025 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్- పోలీసులు విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఉపయోగించే సాధనాల ప్రదర్శనా కార్యక్రమాన్ని ఎస్పీ బి.కృష్ణా రావు ఆద్వర్యం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రణ, నేర దర్యాఫ్తులో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాల గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం సంతోషకరమని తెలిపారు.అసాంఘిక శక్తుల అణచివేతలో,శాంతి భద్రతల పరిరక్షణలో,నేర నియంత్రణ మరియు నేర దర్యాఫ్తులో పోలీసు వారు తీసుకునే చర్యల గురించి వివరించడమే ఈ ఓపెన్ హౌజ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

Post Comment

You May Have Missed

0Shares