ఎమ్మెల్యే కన్నా కు కృతఙ్ఞతలు తెలియజేసిన రాజుపాలెం గ్రామ ప్రజలు
ఎమ్మెల్యే కన్నాకు కృతజ్ఞతలు తెలిపిన రాజుపాలెం గ్రామ ప్రజలు
రాజధాని వాయిస్:నవంబర్ 10, రాజుపాలెం.
మండల కేంద్రమైన రాజుపాలెంలో అమరావతి-హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి ప్రక్కన అత్యంత ఆధునికంగా నూతన గ్రామ సచివాలయం నిర్మించడంలో ప్రముఖపాత్ర పోషించిన గ్రామ సర్పంచ్ పులిబండ్ల అశోక్ ని పలువురు నాయకులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు ప్రశంసించారు.భవన నిర్మాణమంటే ఏదో సామాన్యంగా తూ తూ మంత్రంగా కాకుండా ఆహ్లాదకరంగా అద్భుతంగా అందంగా నిర్మించారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇప్పటివరకు శిథిలావస్థలోనున్న పాత మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయం కొనసాగిందని, నూతన భవన నిర్మాణానికి కృషిచేసి ప్రారంభోత్సవం చేసిన స్థానిక శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.



Post Comment