ఉపాధ్యాయులకు టీచ్ టూల్ పై శిక్షణా కార్యక్రమాలు
రాజధాని వాయిస్:
నవంబర్ 8 పిడుగురాళ్ల.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నవంబర్ 7,8 న టీచ్ టూల్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో పిడుగురాళ్ల మండలంలోని ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు మొత్తం 30 మందికి శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్పీలుగా గుత్తికొండ మండల ప్రజా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు బి. మాధవి, జానపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి కే. మనిరాజు శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరెడ్డి, వై. శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధనా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి విద్యార్థులను ఉపాధ్యాయులు ఏ విధంగా పర్యవేక్షించేయాలి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు తీసుకోవలసిన చర్యలు మొదలేని మొదలైన విషయాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆర్పిలు,సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.



Post Comment