ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం….

 నీలమణి దుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు..

 

శ్రీకాకుళం జిల్లా : రాజధాని వాయిస్

పాతపట్నం నియోజకవర్గం :

 

పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వెలసియున్న శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దేవస్థానము నందుగల ధర్మ హుండీలను దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ వారి ఆదేశములు మేరకు శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి యం సుకన్య, స్థానిక ఆలయ కార్యనిర్వహణాధికారి 

టి.వాసుదేవరావు పర్యవేక్షణలో శుక్రవారం లెక్కించారు. 43 రోజులకు గాను రూ.5,99,274/- లు ఆదాయము లభించినదని ఆలయ సిబ్బంది తెలియజేశారు. ఈ హుండీ లెక్కింపునకు ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి చైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు, ధర్మకర్తల మండలి సభ్యులు వి ఉమాశంకర్ మిశ్రో, యస్ బుల్లిబాబు (ధర్మకర్త ప్రతినిధి), డి వెంకటరమణ, అనుమంచిపల్లి శ్రావణి, శ్రీ వేంకటేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares