ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం
రాజధాని వాయిస్: నవంబర్ 8
పిడుగురాళ్ల.
పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై సీఐ వెంకటరావు,పట్టణ ఎస్సై నాగరాజు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ, డ్రైవర్ల అందరూ యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని,లైసెన్సును దగ్గర ఉంచుకోవాలన్నారు. రాంగ్ రూట్లో ప్రయాణించకుండా,ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించకుండా ఉండాలన్నారు.డ్రైవర్లు అప్రమత్తతో లేకపోతే మన జీవితాలే కాకుండా,ప్రయాణికుల కుటుంబాలు కూడా రోడ్డున పడతాయన్నారు. ప్రతి ఒక్క వాహనానికి ఆర్సి బుక్కు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు.లైసెన్స్ లేని వారికి ఆర్టీవో అధికారులతో మాట్లాడి అందరికి తప్పకుండా లైసెన్స్ లు ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐ వెంకట్రావు, ఎస్సై నాగరాజు,పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.



Post Comment