ఆకలితో ఉన్నవారికి ఆస్తులు, అంతస్తులు అక్కర్లేదు..
కాస్తంత అన్నం పెడితే చాలు
పరుచూరి పూర్ణచంద్రరావు
రాజధాని వాయిస్
అమరావతి,నవంబర్ 17
ఆకలితో ఉన్నవారికి ఆస్తులు, అంతస్తులు అక్కర్లేదని కాస్తంత అన్నం పెడితే చాలని,
అన్నం పరబ్రహ్మస్వరూపమని తెలుగు రైతు జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి, బుచ్చయ్య పాలెం మాజీ సర్పంచ్ పరుచూరి పూర్ణచంద్రరావు అన్నారు.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పెదకూరపాడులోని అంకమ్మ తల్లి దేవాలయంలో జరిగిన వన భోజనాల్లో ఆహారం మిగిలిన విషయాన్ని ఆలయ కమిటీ ప్రతినిధి కర్ణం శ్రీను జన చైతన్య సమితి బృందానికి తెలియపరచడంతో మిగిలిన ఆహారము సేకరించి జన చైతన్య సమితి ప్రతినిధులు అమరావతి లోని చెంచుకాలనీ,డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న యానాది కాలనీకి తీసుకువెళ్లి సోమవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా జన చైతన్య సమితి కార్యదర్శి తుల్లూరి సాంబశివరావు మాట్లాడుతూ,అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని పేదవారి ఆకలి తీర్చడంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జన చైతన్యసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి విజయ్ బెన్నిబాబు, ప్రతినిధులు బెజ్జం నాగేశ్వరరావు,చిమిలి అశోక్,షేక్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.



Post Comment