ఆంధ్రుల కలల రాజధాని నేడు సిఎం చంద్రబాబుతో సాకారం …

సూపర్ సిక్స్ హామీలతో కూటమి ప్రభుత్వం 

సూపర్ సక్సెస్

ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ 

 

రాజధాని వాయిస్:పిబ్రవరి 04

రాజుపాలెం.

 

 

మండలంలోని బీరవల్లిపాయ గ్రామంలో 32 లక్షలతో నూతనంగా నిర్మించబోతున్న గ్రామ పంచాయతీ కార్యాలయ శంకుస్థాపన.10 లక్షలతో నూతనంగా నిర్మించబోతున్న ఎంపీయూపీ స్కూల్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన.మరియు కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కన్నా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రచార పిచ్చితో జగన్ ఫోటోలు ముద్రించుకున్నాడని,ఆర్థిక వ్యవస్థ ని నాశనం చేసారని,3 రాజధానులంటూ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.సిఎం నారా చంద్రబాబు నాయుడు తోనే రాజధాని కలలు సాకారం అవుతాయని,ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు,మండల టిడిపి అధ్యక్షుడు అంచుల నరసింహ రావు,బీరవల్లిపాయ సర్పంచ్ పసుపులేటి వెంకట స్వామి,టిడిపి నాయకులు అంకాళ్ల ప్రభుదాసు,పూజల వెంకట కోటయ్య,డాక్టర్ వడ్డేంపూడి పవన్ కుమార్,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Post Comment

You May Have Missed

0Shares