ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల విభాగం అధ్యక్షుడిగా ఏ కాశీ విశ్వనాథం నియామకం
ఏపీ మానవ హక్కుల విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఏ. కాశీ విశ్వనాథం నియామకం
రాజధాని వాయిస్:డిశంబర్ 24,పిడుగురాళ్ళ.
పర్యావరణ పౌర హక్కుల పరిరక్షకులు సామాజిక సంక్షేమ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఆత్మకూరు కాశి విశ్వనాథం నియమించబడ్డారు.ఈ సందర్భంగా కాశి విశ్వనాథం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ సిటిజన్ సివిల్ రైట్స్ డిపెండెర్స్ సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ లో డిస్టిక్ ఇన్చార్జిగా ఎంపిక అయినందుకు సంతోషంగా ఉందని, సామాజిక న్యాయం పట్ల అంకిత భావం కలిగి ఉండి, మానవ హక్కులను కాపాడటంలో నిబద్దతగా పనిచేసి, మానవ హక్కుల ఉల్లంఘనలు జరగకుండా చూస్తానని, మానవ హక్కుల విభాగంలో పనిచేస్తూ సామాజిక అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహిస్తూ విధానపరమైన సంస్కరణ కోసం కృషి చేస్తానని, నైతిక విధానాలు పాటిస్తూ, మానవ హక్కుల పరిరక్షణలో ముందుంటానని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కాశీ విశ్వనాథంకు అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Comment