ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ ను ప్రారంభించిన ఎక్సైజ్ అధికారులు
ముఖ్య అతిథిగా పాల్గొన్న అనగాని శివప్రసాద్
అక్టోబర్ 25 రాజధాని వాయిస్ రేపల్లె
అక్టోబర్ 25 శనివారం రేపల్లె ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రేపల్లె ,నగరం పట్టణంలోని వివిధ షాపుల వద్ద అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇసుకపల్లి లో గల సాయి బాలాజి మద్యం దుకాణం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంప్ శాఖ మాత్యులు అనగాని సత్య ప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ చేతుల మీదగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ యొక్క పోస్టర్లు, కార్డుబోర్డ్ మరియు కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ భద్రత మా బాధ్యత అనే శీర్షిక కింద మీరు తాగే మద్యం నాణ్యమైనదైనా? కాదా అని తెలుసుకొనుటకు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ యొక్క పోస్టర్లు,కార్డుబోర్డ్ మరియు కరపత్రాలు ఎక్సైజ్ అధికారులతో కలిసి అయన విడుదల చేసారు . ఈ కార్యక్రమములో వారు మాట్లాడుతూ పోస్టర్ ల పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను డౌన్లోడ్ చేసుకుని కన్స్యూమర్ లాగిన్ నుండి బాటిల్ మూత పై గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మద్యం నాణ్యమైనదేనా? కాదా అని తెలుసుకోవచ్చు అని అదేవిధంగా రేపల్లె నియోజకవర్గం లో ఎక్కడా కల్తీ మద్యం లేదు అని వారు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేపల్లె ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ . రాజశ్రీ గారు మాట్లాడుతూ ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుట వలన నకిలీ మద్యం విక్రయాలను అరికట్టి ప్రజలను నకిలీ మద్యం బారిన పడకుండా రక్షించడంలో మద్దతుగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.



Post Comment