అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ఎస్ పి, కలెక్టర్,ఎమ్మెల్యే
రాజధాని వాయిస్:
నరసరావుపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమర వీరులకు మంగళవారం ఘన నివాళులు అర్పించారు.
పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో కార్యక్రమం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృత్తిక శుక్ల,ఎమ్మెల్యే అరవింద్ బాబు పూలమాలలతో గౌరవించారు.విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు అందరికి ప్రేరణగా నిలిచారన్నారు.



Post Comment