అనంతబాబుపై జగన్కు అమితమైన ప్రేమ..
ఎమ్మెల్సీ పదవికి అనంతబాబు అనర్హుడు..
వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి
జగన్ అండతోనే దళితులపై దాడులు..m
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు,ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు…
రాజధాని వాయిస్ : ఫిబ్రవరి 21
వేమూరు.
ఒక దళిత యువకుడిని అత్యంత క్రూరంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి రాజ్యాంగ పదవి అప్పగించడం జగన్ నేర ప్రవృత్తికి నిదర్శనమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు,ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు తీవ్రంగా మండిపడ్డారు.
బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల ప్రజలను వేధించే వారికి కీలక పదవులు ఇవ్వడం వైసీపీ రాజ్యాంగంగా మారిందని ఆయన విమర్శించారు.
శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
2022 మే 19న అర్ధరాత్రి జరిగిన దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రాష్ట్రాన్ని కుదిపేసిందన్నారు.
వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన యువకుడిని తీసుకెళ్లి చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అని తెలిసి ప్రజలు షాక్కు గురయ్యారని తెలిపారు.
ఎన్నికల ముందు
నా ఎస్సీలు,నా బీసీలు అంటూ మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా దళిత యువకుడిని హత్య చేసిన వ్యక్తికి అండగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని,పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని విమర్శించారు.
దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు.
టీడీపీ పోరాటంతోనే కేసు పురోగమించి శిక్ష పడిందన్నారు.జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే బయటకు వచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు.
తాజాగా సుప్రీంకోర్టు తీర్పు జగన్ పార్టీకి చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.జగన్ పాలనలో దళితులపై దమనకాండ
జగన్ రెడ్డికి దళితులపై చిన్నచూపు ముందునుంచే ఉందని ఆనంద బాబు ఆరోపించారు.
దళితులను కేవలం ఓటర్లుగా మాత్రమే చూసి,అభివృద్ధి–సంక్షేమం నుంచి దూరం చేశారని విమర్శించారు.ప్రశ్నిస్తే చంపడం,
ఎదిరిస్తే అణచివేయడం జగన్ పాలన లక్షణమని అన్నారు.2019–2024 మధ్య దళితులపై వేలాది దాడులు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దళితులు హత్యలకు గురయ్యారని పేర్కొన్నారు.
దళితుల ఆత్మగౌరవం, భద్రత,హక్కుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల ప్రజలు సురక్షితంగా జీవిస్తున్నారని చెప్పారు.2026–27 బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి రూ.22,000 కోట్ల కేటాయింపులు చేసి ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి,సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆనంద బాబు స్పష్టం చేశారు.



Post Comment