అంగన్వాడీ కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

అంగన్వాడీ కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

రాజధాని వాయిస్ డిసెంబర్ 23 చుండూరు,

చుండూరు 2వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సిడిపిఓ లక్ష్మీదేవి,సూపర్వైజర్ శకుంతల సూచనలతో ప్రతి పండుగ విశిష్టతను తల్లులకు తెలియజేసే విధంగా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు.క్రిస్మస్ వేడుకలలో భాగంగా పిల్లలకు వేషధారణలను వేయించి పాటలకు అనుగుణంగా నృత్యం చేసి దేవుని మహిమలను తెలియజేశారు.క్రీస్తు గీతాలను ఆలపించి నాట్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రేమ,దయకు క్రిస్మస్ ప్రతీకని రాజ్యలక్ష్మి అన్నారు.అనంతరం క్రిస్మస్ కేకును పిల్లల చేత కట్ చేయించారు.అంగన్వాడీ కేంద్రాన్ని జెండాలతో రంగురంగులతో తీర్చిదిద్దారు.అంగన్వాడి కేంద్ర పరిధిలోని తల్లులను, గర్భవతులను,బాలింతలను సమావేశపరిచి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అంగన్వాడీ కార్యకర్త రాజ్యలక్ష్మిని తల్లులు,ప్రజలు అభినందించారు.కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు నాగమణి, తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares